ENGLISH

అనుష్కని ఆమె మ్యాచ్‌ చేయగలదా?

25 October 2019-15:30 PM

జేజమ్మ అనుష్క నటించిన 'భాగమతి' సినిమాని హిందీలో రీమేక్‌ చేసేందుకు గత కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. 'భాగమతి' పాత్రలో భూమి పడ్నేకర్‌ హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. భాగమతి సినిమాకి అనుష్క నటన కంటే, అనుష్క ఇమేజ్‌ పెద్ద ప్లస్‌ అయ్యింది. భూమి పడ్నేకర్‌ మంచి నటి. కానీ, అనుష్కని మ్యాచ్‌ చేయలేదు ఇమేజ్‌ విషయంలో. అనుష్కకు అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్‌ ఉంది.

 

'బాహుబలి' సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా ఇది. ఆ ఇమేజ్‌తోనే సినిమాలో విషయం ఉందా.? లేదా.? అనే విషయాన్ని పక్కన పెట్టేసి మరీ, అభిమానులు 'భాగమతి'కి విజయం కట్టబెట్టారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రిస్క్‌ చేయలేక చాలా సినిమాలు వాయిదా పడిన గడ్డు సమయంలో వచ్చి 'భాగమతి' మంచి విజయం అందుకోవడం ఆషామాషీ విషయం కాదు. అలాంటిది భూమి పడ్నేకర్‌తో ఇప్పుడు బాలీవుడ్‌ భాగమతి అంటే, రిజల్ట్‌ ఎలా ఉంటుందో ఏమో.

 

త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి ఒరిజినల్‌ డైరెక్టర్‌ జి.అశోక్‌ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయనీ బాలీవుడ్‌ సమాచారం. 'టాయిలెట్‌: ఏక్‌ ప్రేమకథ' సినిమా నిర్మాతలు ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం భూమి పడ్నేకర్‌ 'సాండ్‌ కీ ఆంఖ్‌' చిత్రంలో తాప్సీతో కలిసి నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ALSO READ: 'విజిల్‌' మూవీ రివ్యూ & రేటింగ్!