ENGLISH

ఓటీటీలో అయినా ఆ పాట‌ని చూస్తామా?

08 March 2022-13:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్‌` ఇటీవ‌లే బాక్సాఫీసు ముందుకొచ్చింది. తొలి షో కే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌కి ద‌గ్గ‌ర్లో ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఎగ్రెసివ్ గా చూపించిన విధానం ఫ్యాన్స్‌కి బాగా న‌చ్చింది. రానా న‌ట‌న గురించి కూడా ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే... కేక పుట్టించింది. అయితే ఈ సినిమాలో ఓ పాట లేదు. `అంత ఇష్ట‌మేంద‌య్యా` ఆల్బ‌మ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాలో లేదు. ర‌న్ టైమ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ పాట‌ని క‌త్తిరించారు అని చిత్ర‌బృందం చెబుతోంది. అయితే.. బ‌య‌ట టాక్ మాత్రం వేరేలా ఉంది. నిత్య‌మీన‌న్ పై కోపంతోనే త్రివిక్ర‌మ్ ఈ పాట‌ని క‌ట్ చేశార‌ని వినికిడి.

 

ఇప్పుడు త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తోంది. క‌నీసం ఓటీటీలో అయినా ఈ పాట చూస్తామా? అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో ర‌న్ టైమ్ స‌మ‌స్య కాదు. మూడు గంట‌ల సినిమా అయినా చూస్తారు. ఈసారి కూడా పాట క‌ట్ చేశారంటే అది క‌చ్చితంగా నిత్య‌మీన‌న్‌పై కోపంతోనే అనేది తేలిపోతుంది. పాట ఉంచితే, ఈ రూమ‌ర్ల‌కు బ్రేక్ ప‌డుతుంది. మ‌రి.. చిత్ర‌బృందం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

ALSO READ: జగన్ కి థ్యాంక్స్ : చిరు