ENGLISH

ప్ర‌భాస్‌పై బెంగ పెట్టుకున్న ఫ్యాన్స్‌

08 March 2022-14:26 PM

ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌. త‌న సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ వెర్ష‌న్‌లోనూ విడుదల అవుతోంది. సినిమా సినిమాకీ త‌న అభిమాన‌గ‌ణం పెరుగుతూనే ఉంది. బాలీవుడ్ లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. త‌న ఫ్యాన్స్ అంటే, ప్ర‌భాస్‌కీ చాలా ఇష్టం. అందుకే ప్రేమ‌గా `డార్లింగ్స్‌` అని పిలుచుకుంటుంటాడు. ప్ర‌భాస్ ప్ర‌తీ మూమెంట్ నీ, మాట‌నీ ఎంజాయ్ చేస్తుంటారు అభిమానులు. అయితే ఇప్పుడు వాళ్లంద‌రికీ ప్ర‌భాస్ పై బెంగ పెరిగిపోయింది.

 

ప్ర‌భాస్ ఇప్పుడు బాగా లావైపోయాడు. రాధే శ్యామ్ సినిమాలో స్లిమ్ముగా క‌నిపిస్తున్నాడు కానీ, బ‌య‌ట ప్రెస్ మీట్ల‌లో, ఇంట‌ర్వ్యూల‌లో బొద్దుగా త‌యార‌య్యాడు. బుగ్గలు బాగా వ‌చ్చేశాయి. అన‌ర్గ‌ళంగానూ మాట్లాడ‌లేక‌పోతున్నాడు. పాన్ ఇండియా స్టారేంటి? ఇలా త‌యారైపోయాడు? అన్న‌ది ఫ్యాన్స్ కంగారు. త‌న కాస్ట్యూమ్స్ విష‌యంలోనూ ప్ర‌భాస్ శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఫ్యాన్స్ స‌ల‌హాలు ఇస్తున్నారు. చేతిలో పాన్ ఇండియా సినిమాలున్నాయి. క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వాటికోస‌మైనా ప్ర‌భాస్ కాస్త స్లిమ్ గా మారాల్సిన అవ‌స‌రం ఉంది.

ALSO READ: ఓటీటీలో అయినా ఆ పాట‌ని చూస్తామా?