ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర పోటీ మామూలుగా ఉండడం లేదు. దాదాపు నాలుగైదు సినిమాలు రాబోతున్నాయి. అన్నీ పెద్దవే. అందులో `భీమ్లా నాయక్` ఒకటి. పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా నటించిన సినిమా ఇది. సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నాడు. ఇటీవల టీజర్ వచ్చింది. ఆ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ దుమ్ము రేపడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
అయితే.. ఇప్పుడు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పినా, ఆ అవకాశం లేదని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా రాదని, వేసవికి షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. మరోవైపు పవన్ - క్రిష్‌ల `వీరమల్లు` కూడా.. వేసవిలోనే వస్తుంది. కాబట్టి... ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ లెక్కన `భీమ్లా నాయక్` మార్చిలోనూ... `వీరమల్లు` మేలోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయని టాక్.
ALSO READ: ఓటీటీలో హ్యాట్రిక్... నానికే ఇలా ఎందుకు?