కరోనా ఫస్ట్ వేవ్ ధాటికి థియేటర్లు మూతపడినప్పుడు మరో ఆస్కారం లేకపోవడంతో `వి` సినిమాని ఓటీటీకి ఇచ్చేసింది చిత్రబృందం. ఆ సమయంలో.. నాని చాలా అప్ సెట్ అయ్యాడు. ఆ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయగలరని, ఓటీటీ సినిమా కాదన్నది నాని నమ్మకం. అదే నిజమైంది కూడా. `వి` సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే.. అనుకోకుండా `టక్ జగదీష్` కూడా ఓటీటీకే వెళ్లిపోయింది. ఈసినిమాని సెప్టెంబరు 10న ఓటీటీలో విడుదల చేస్తారని సమాచారం. దాదాపు 37 కోట్లకు అమేజాన్ డీల్ కుదుర్చుకుంది.
ఈసారి కూడా ఈ సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేసేలా నాని పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇప్పుడు `శ్యామ్ సింగరాయ్` కూడా అమేజాన్ లోనే వేస్తార్ట. ఇది కూడా థియేటరికల్ రిలీజ్ కాదని, ఓటీటీలోనే ఈ సినిమా చూడాల్సివస్తుందన్నది తాజా సమాచారం. `టక్ జగదీష్`కి లానే... శ్యామ్ సింగరాయ్ కి కూడా.. అమేజాన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందని, ఈ ఆఫర్ ని నాని కూడా కాదనలేకపోతున్నాడని టాక్. నాని కెరీర్‌లోనే ఖరీదైన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఆసినిమా లాభాలు గడించాలంటే, థియేటర్లలో విడుదలై.. నాని కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లు సాధించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమైన విషయమే.
అయితే అమేజాన్ డీల్ తో నిర్మాతలకు లాభం చేకూరుతుందని, థియేటర్లలో విడుదల కాకపోయినా, మంచి టేబుల్ ప్రాఫిట్ తో గట్టెక్కుతారని నాని భావిస్తున్నాడట. అందుకే తనకు ఇష్టం లేకపోయినా ఈ సినిమాని సైతం ఓటీటీకే వదిలేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ALSO READ: 'రాజరాజ చోర' మూవీ రివ్యూ & రేటింగ్!