మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో `భీమ్లా నాయక్` గా రూపుది్దుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కథానాయకులుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలతో పాటు ఓ పాట కూడా రాశాడు త్రివిక్రమ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతోంది.
ఇప్పుడు ప్రమోషన్లకూ శ్రీకారం చుట్టేశారు. ఇప్పటికే మూడు పాటల్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడు టీజర్ నీ చూపించబోతోందట. డిసెంబరు 15న భీమ్లా నాయక్ టీజర్ బయటకు రానుందని తెలుస్తోంది. ఈలోగా మరో రెండు పాటల్ని కూడా విడుదల చేస్తార్ట. డిసెంబరు 15 నుంచి ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. తమన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త హెగ్డే కథానాయికలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. త్వరలో దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందట. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ALSO READ: శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం