ENGLISH

బిగ్‌బాస్‌ ముచ్చటు.. ఆ సందడి ఇప్పుడేదీ.?

23 December 2020-15:31 PM

ఈసారి బిగ్‌బాస్‌ చాలా డల్‌గా సాగింది. మెగాస్టార్‌ చిరంజీవి కారణంగా ఫినాలే ఎపిసోడ్‌లో.. జోష్‌ కనిపించింది. సీజన్‌ ముగిశాక, కంటెస్టెంట్స్‌ ఇంటర్వ్యూలతో న్యూస్‌ ఛానళ్ళు, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ళు హోరెత్తించేసేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించడంలేదు. కొందరు కంటెస్టెంట్స్‌ కొన్ని న్యూస్‌ ఛానళ్ళలో కన్పిస్తున్నా.. గతంతో పోల్చితే, ఇఫ్పుడు చాలా భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. బిగ్‌బాస్‌ సెలబ్రిటీల్ని అస్సలెవరూ పట్టించుకోవడంలేదన్న వాదన విన్పిస్తోంది.

 

సీజన్‌ విన్నర్‌ అబిజీత్‌ విషయంలోనే కాస్తో కూస్తో హంగామా సోషల్‌ మీడియాలో నడుస్తోంది తప్ప.. మిగతా కంటెస్టెంట్స్‌ పరిస్థితి అంత గొప్పగా ఏమీ వున్నట్లు కన్పించడంలేదు. గత సీజన్‌నే తీసుకుంటే, విన్నర్‌ రాహుల్‌తోపాటు రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి, పునర్నవి, అలీ రెజా.. ఆ తర్వాత సినిమా అవకాశాలు బాగానే పట్టారు.

 

ఈసారి మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా దివికి ఛాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించడం మినహా.. అంత హంగామా ఏమీ ఆ తర్వాత లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వున్నంతలో సోహెల్‌ కాస్తో కూస్తో న్యూస్‌ ఛానళ్ళలో హల్‌చల్‌ చేస్తున్నాడు. రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ పరిస్థితే మరీ దారుణంగా తయారయ్యింది. ఈ సీజన్‌ అనుభవాలతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు వచ్చే సీజన్‌ కోసం ఒకింత పాపులారిటీ వున్న సెలబ్రిటీల్ని హౌస్‌మేట్స్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారట.

ALSO READ: త‌క్కువ రోజుల్లో ఎక్కువ సొమ్ము.. ప‌వ‌న్ స్ట్రాట‌జీ ఇదే!