ENGLISH

త‌క్కువ రోజుల్లో ఎక్కువ సొమ్ము.. ప‌వ‌న్ స్ట్రాట‌జీ ఇదే!

23 December 2020-13:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎగ్రెసివ్ గా ఉంటాడు త‌ప్ప‌, అంతే వేగంగా సినిమాలు చేయ‌డ‌న్న‌ది వాళ్ల అభిమానులు సైతం ఒప్పుకునే వాస్త‌వం. ప‌వ‌న్ త‌న క్రేజ్ ని ఉప‌యోగించుకుంటే.. ఈపాటికి బోలెడ‌న్ని సినిమాలు చేయాలి. కానీ చేయ‌డు. ఇప్పుడిప్పుడే ప‌వ‌న్ త‌న క్రేజ్ ని క్యాష్ చేసుకోవ‌డంలో స‌క్సెస్ అవుతున్నాడు. త‌క్కువ రోజుల్లో ఎక్కువ డ‌బ్బులు సంపాదించే సినిమాలు ఎంపిక చేస్తున్నాడు. వ‌కీల్ సాబ్, అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ సినిమాలే ఇందుకు సాక్ష్యం.

 

వ‌కీల్ సాబ్ కోసం ప‌వ‌న్ అందుకున్న పారితోషికం 60 కొట్లన్నది టాలీవుడ్ టాక్. ఈ సినిమాకి ప‌వ‌న్ ఇచ్చిన కాల్షీట్లు 30 మాత్ర‌మే. ఇప్పుడు అయ్య‌ప్ప‌ నుమ్ కోషియ‌మ్ కీ అంతే. ఈసినిమా కోసం ప‌వ‌న్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడ‌ని టాక్‌. ఈ సినిమా కూడా నెల రోజుల్లో పూర్తి చేయ‌నున్నాడు. ఇక మీద‌ట కూడా త‌క్కువ రోజుల్లో పూర్త‌య్యే సినిమాల‌నే ఎంచుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇది తెలివైన ఎత్తుగ‌డ‌. ఇలా చిన్న చిన్న సినిమాలు చేస్తే.. యేడాదికి 4 సినిమాలు చేసేయొచ్చు. అలా 200 కోట్లు ఆర్జించ‌వ‌చ్చు. ఒక్కో సినిమాకీ రెండు మూడేళ్లు క‌ష్ట‌ప‌డి వంద కోట్లు తీసుకున్నా.. ఇంత సంపాదించ‌లేం క‌దా..?!

ALSO READ: లూసీఫ‌ర్ ని మార్పులు ముంచేస్తాయా?