ఎప్పుడెప్పుడా అని బుల్లి తెర వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 5 అప్‌డేట్ వచ్చేసింది. తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ కొత్త సీజన్ కి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 5 నుంచి... ఈ షో బుల్లి తెర పై సందడి చేయనుంది. ఇప్పటికే 16 మంది సెలబ్రెటీల పేర్లు ఖాయం చేసేశారు. వాళ్లని త్వరలో క్వారెంటైన్ కి తరలిస్తారు. ఆ తరవాత.. నేరుగా వాళ్లంతా సెట్లోకి అడుగుపెడతారు. వారంతంలో ఈ షో రాత్రి 9 గంటలకే మొదలవుతుంది. మిగిలిన రోజుల్లో మాత్రం 10 గంటల నుంచి మొదలవుతుంది.
ఇప్పటి వరకూ బిగ్ బాస్ విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. ఈసారి ప్రైజ్ మనీ పెరగబోతోందని టాక్. అయితే ఎంత పెంచుతారన్న విషయంలో స్పష్టత లేదు. ఈసారి ప్రైజ్ మనీ 75 లక్షలు ఉండొచ్చని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జునతో పాటు మరో హోస్ట్ కూడా కనిపించనున్నాడని టాక్. అతను ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
ALSO READ: వీరయ్య కాదు... వాల్తేర్ శీను