చిరంజీవి - బాబి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి పుట్టిన రోజున.. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు.. పోస్టర్ కూడా విడుదలైంది. పడవపై వేటకు వెళ్తున్న జాలరి.. పోజుతో.. చిరు కనిపించాడు. ఇక మాస్ కి పూనకాలే... అంటూ చిత్రబృందం కూడా హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రానికి వీరయ్య అనే పేరు పెట్టారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టైటిల్ విషయంలో చిరు ఏమాత్రం సంతృప్తిగా లేడని, టైటిల్ మార్చమని బాబి ని సూచించాడని టాక్.
చిరులోని అసంతృప్తిని గ్రహించిన బాబి.. వెంటనే ఈసినిమా కోసం మరో టైటిల్ నీ బయటకు తీశాడట. అదే.. వాల్తేరు శ్రీను. విశాఖ నేపథ్యంలో సాగే కథ ఇది. చిరంజీవి జాలరిగా కనిపించబోతున్నాడు. అందుకే ఈ టైపు టైటిల్ సెలెక్ట్ చేశారు. ఈ టైటిల్ చిరుకీ నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ: సినిమాలకు సమంత దూరం