టాలీవుడ్ లోని అగ్రశ్రేణి కథానాయికల జాబితాలో సమంత పేరు కూడా ఉంటుంది. టాలీవుడ్ అనేంటి..? తమిళంలోనూ తనకి మంచి క్రేజ్ ఉంది. `ఫ్యామిలీమేన్ 2` తో దేశ వ్యాప్తంగానూ అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటానంటోంది సమంత. ప్రస్తుతం నాకు బ్రేక్ కావాలి.. కొంతకాలం కథలు కూడా వినను. ఆ తరవాత. ఫ్రెష్ మైండ్ తో మళ్లీ నటిస్తా`` అని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం `శాకుంతలమ్` పూర్తి చేసింది సమంత. దీని తరవాత.. తను కొత్త సినిమాలేం చేయబోవడం లేదు.
పవన్ సినిమాలో సమంత నటిస్తోందని ఇటీవల వార్తలొచ్చాయి. వాటికీ చెక్ పెట్టింది. `పవన్ సినిమాలో నేను లేను` అని క్లారిటీ ఇచ్చేసింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ పెట్టింది. ఇటీవల సమంత గోవాలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడ ఫామ్ హౌస్ నిర్మించే ఆలోచనలో ఉంది. ఈ విరామంలో ఫామ్ హోస్ కి సంబంధించిన పనుల్ని దగ్గరుండి చూసుకుంటుందని సమాచారం. మరోవైపు సమంత తల్లి కాబోతోందని, అందుకే ఈ గ్యాప్ తీసుకుంటోందని చెప్పుకుంటున్నారు. దీనిపై మాత్రం ఓ క్లారిటీ రావాల్సివుంది.
ALSO READ: Samantha Latest Photoshoot