ENGLISH

హీరోగా బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన అబిజీత్‌.!

22 December 2020-13:26 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ వన్‌ విజేత శివ బాలాజీ, యాక్టింగ్‌ కెరీర్‌లో ఆ తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. రెండో సీజన్‌ విన్నర్‌ అయిన కౌశల్‌ పరిస్థితీ అంతే. మూడో సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా, సింగర్‌గా మరింత ఎత్తుకు ఎదిగాడా.? అంటే, అదీ లేదు. బిగ్‌బాస్‌ సీజన్‌తో కొందరికి మాత్రం కెరీర్‌లో గ్రోత్‌ కనిపించింది. యాంకర్‌ భాను తదితరుల్ని ఈ లిస్ట్‌లో చేర్చెయొచ్చు. ఇంతకీ, నాలుగో సీజన్‌ విన్నర్‌ అబిజీత్‌ పరిస్థితేంటి.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అబిజీత్‌ ఇప్పటికే ఓ సినిమాలో హీరోగా ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. అది కూడా కింగ్‌ అక్కినేని నాగార్జున చలవతోనేనని అంటున్నారు. అబిజీత్‌ 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' సినిమాలో నటించిన విషయం విదితమే. ఆ సినిమాతో నటి అక్కినేని అమల రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక, బిగ్‌ హౌస్‌లో నాగార్జున సందర్భానుసారం అబిజీత్‌కి క్లాసులు పీకినా, ఓవరాల్‌గా అబిజీత్‌ పట్ల నాగ్‌కి పాజిటివ్‌ కార్నర్‌ వుందన్నది నిర్వివాదాంశం. ఇదిలా వుంటే, గత సీజన్లకు భిన్నంగా, ఈసారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి వివిధ రంగాల్లో అవకాశాలు మెరుగుపడుతున్నాయట. దర్శకుడు సూర్య కిరణ్‌ త్వరలోనే ఓ సినిమాని అనౌన్స్‌ చేయబోతున్నాడనీ, అమ్మ రాజశేఖర్‌ కూడా ఇకపై కొరియోగ్రఫీనీ, డైరెక్షన్‌నీ చేపట్టబోతున్నాడనీ అంటున్నారు. అబిజీత్‌ విషయానికొస్తే, ఈ బిగ్‌బాస్‌ విన్నర్‌ హీరోగా నటించే సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభమవుతుందని సమాచారం.

ALSO READ: 'సోలో' రిలీజ్‌.. టాలీవుడ్‌కి నరాలు తెగే ఉత్కంఠే.!