ENGLISH

బన్నీ స్టైల్‌కి పడిపోయిన మరో బాలీవుడ్‌ హీరో!

01 May 2019-16:41 PM

టాలీవుడ్‌ హీరోల్లో అల్లు అర్జున్‌ స్టైలే వేరు. అందుకే ఆయన్ని అభిమానులు ముద్దుగా 'స్టైలిష్‌ స్టార్‌' అని పిలుచుకుంటారు. సినిమా సినిమాకీ ఏదో ఒక కొత్త స్టైల్‌ పరిచయం చేస్తుంటాడు అల్లు అర్జున్‌. ముఖ్యంగా హెయిర్‌ స్టైల్స్‌ విషయంలో అల్లు అర్జున్‌ని కొట్టేవాళ్లే లేరని చెప్పాలి. యూతే కాదు, ఊహ తెలిసిన బుడ్డోడు కూడా అల్లు అర్జున్‌లా హెయిర్‌ స్టైల్‌ చేసుకుని మురిసిపోతుంటాడు. ఈ సంగతి పక్కన పెడితే, ఇంత స్టైల్‌గా ట్రాక్‌ రికార్డు ఉంది కాబట్టే, మనోడు బాలీవుడ్‌ హీరోల్ని సైతం ఆకర్షిస్తుంటాడు. మొన్నా మధ్య టైగర్‌ ష్రాఫ్‌ తనకు బన్నీ స్టైల్‌ అంటే ఎంతో ఇష్టం. హి ఈజ్‌ మై ఫేవరేట్‌ హీరో ఇన్‌ టాలీవుడ్‌ అని చెప్పేశాడు.

 

తాజాగా మరో బాలీవుడ్‌ హీరో కూడా బన్నీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయన మరెవరో కాదు, ఇటీవల 'గల్లీబోయ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొత్త హీరో సిద్ధాంత్‌ చతుర్వేది. ఈయన ఏకంగా అల్లు అర్జున్‌ స్టైల్‌ని ఇమిటేట్‌ చేసేస్తున్నాడు. తొలి సినిమా అయినా 'గల్లీబోయ్‌' చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయిన ఈ హ్యాండ్‌సమ్‌ హీరో ఇటీవల హైద్రాబాద్‌ వచ్చినప్పుడు తనకు అల్లు అర్జున్‌ అంటే ఇష్టమనీ, తనను ఒక్కసారైనా కలవాలనుకుంటున్నాననీ చెప్పాడు. ఈ విషయం తెలిసి బన్నీ షాకయ్యాడట. త్వరలోనే ఆయన్ని కలుస్తాననీ, 'గల్లీబోయ్‌' సినిమాలో 'షేర్‌' పాత్రలో సిద్ధాంత్‌ అద్భుతమైన నటన కనబరిచాడనీ అన్నాడు. ప్రస్తుతం బన్నీ - త్రివిక్రమ్‌ కాంబో మూవీ సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

ALSO READ: మే 17న 'అర్జున్‌ సురవరం' అయినా అనుమానమే?