ENGLISH

'మహర్షి'ని తొక్కేస్తున్నదెవరు?

01 May 2019-16:38 PM

ఓ పక్క 'మహర్షి' అంచనాలు ఆకాశాన్నంటుతుంటే, మరో వైపు నెగిటివ్‌ ప్రచారం అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా మహేష్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చేస్తున్నారు. 'మహర్షి'పై అంత దారుణంగా నెగిటివ్‌ ప్రచారానికి ఒడిగడుతున్నదెవరో అర్ధం కావడం లేదు వారికి ఏ రకంగా చూసినా 'మహర్షి' విషయంలో నెగిటివిటీకి ఆస్కారమే లేదు. డైరెక్టర్‌ పరంగా వంశీ పైడిపల్లికి మంచి పేరుంది. నిర్మాతలకు మంచి క్రేజ్‌ ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురూ ముగ్గురే. మ్యూజిక్‌ పరంగా దేవిశ్రీ రాక్‌స్టార్‌. హీరోయిన్‌ టాప్‌ లెవల్‌. అల్లరోడి సంగతి చెప్పనే అక్కర్లేదు. అన్నింటికీ మించి సూపర్‌స్టార్‌. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగా జరిగింది.

 

అయినా ఎందుకో ఇంతకుముందెన్నడూ మహేష్‌ సినిమాలకు రానంత నెగిటివిటీ ఈ సినిమాకి ప్రచారంలో ఉంది. ఇంకోవైపు అంచనాలకు మించిన బడ్జెట్‌తో సినిమా తెరకెక్కింది. దాంతో పైకి ఎంత కాన్ఫిడెంట్‌గా కనిపించినా ఎందుకో నిర్మాతల్లో కూడా లోలోపల తెలియని ఆందోళన ఉందట. రోజుకో నెగిటివ్‌ వార్త బయటికి వస్తోంది సినిమా గురించి. సో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొనడం సహజమే. అయితే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే అంతా మన మంచికే అని సరిపెట్టుకుంటున్నారట. ఈ టెన్షన్‌ తీరాలంటే మరో ఎనిమిది రోజులు ఆగక తప్పదు. మే 9న 'మహర్షి' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: మే 17న 'అర్జున్‌ సురవరం' అయినా అనుమానమే?