ENGLISH

అన్నాద‌మ్ములిద్ద‌రినీ ప‌ట్టేశాడుగా

04 June 2022-13:00 PM

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాస్త కుదురుకున్నాడు. అయితే ఆ త‌ర‌వాత సినిమా ఎవ‌రితో? ఎప్పుడు? అనే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రాలేదు. ఆమ‌ధ్య నాగ‌చైత‌న్య కోసం ఓ క‌థ రాశాడ‌ని, అది చైతూకి వినిపించాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ అఖిల్ కి కూడా ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. అఖిల్ కూడా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో మ‌ళ్లీ సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని తెలుస్తోంది. అటు చైతూతో గానీ, ఇటు అఖిల్ తో గాని, భాస్క‌ర్ ఎవ‌రితో సినిమా చేసినా, అది గీతా ఆర్ట్స్ లోనే. ఇది ఫిక్స్‌. అఖిల్ ఓకే అంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` టీమ్ మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన‌ట్టు అవుతుంది.

 

చైతూ న‌టించిన `థ్యాంక్యూ` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. మ‌రోవైపు.. ప‌ర‌శురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. `నాగేశ్వ‌ర‌రావు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. జులై నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంది. చైతూతో భాస్క‌ర్ ఓకే అంటే.. నాగేశ్వ‌ర‌రావు పూర్త‌య్యేంత వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాల్సిందే. అదే.. అఖిల్ అయితే, `ఏజెంట్‌` పూర్త‌యిన వెంట‌నే.. ఈ ప్రాజెక్టుని మొద‌లెట్టేయొచ్చు.

ALSO READ: 'వారియ‌ర్‌'ని ఇంత మంది రిజెక్ట్ చేశారా?