ENGLISH

'అసురుడు'... ఈ తార‌క రాముడు

04 June 2022-10:15 AM

`అసుర అసుర అసుర అసుర‌.. రావ‌ణాసుర‌` అంటూ.. `ల‌వ‌కుశ‌`లో విల‌నిజం పండించాడు ఎన్టీఆర్‌. మ‌ళ్లీ అలాంటి అవ‌కాశ‌మే రాబోతోంది. ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో ఓ చిత్ర రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఎన్టీఆర్ ఆర్ట్స్‌, మైత్రీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి `అసురుడు` లేదా `అసుర‌` అనే టైటిళ్లు ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్‌లో నెగిటీవ్ షేడ్స్ ఉంటాయ‌ని తెలుస్తోంది. అందుకే ఈ త‌ర‌హా టైటిళ్ల‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ప్ర‌శాంత్ నీల్ కి మూడ‌క్ష‌రాల టైటిల్ అంటే సెంటిమెంట్. అందుకే `అసుర‌`కే ఓటేసే ఛాన్సుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఆ త‌ర‌వాతే.. ప్ర‌శాంత్ నీల్ సినిమా మొద‌ల‌వుతుంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో క‌థ గురించి చర్చించార‌ని టాక్‌.

ALSO READ: విక్రమ్ మూవీ రివ్యూ & రేటింగ్