ENGLISH

పవన్ పై గురిపెట్టిన బోయపాటి!

26 August 2017-13:50 PM

పవన్ కళ్యాణ్ తో పనిచేయడానికి ఆసక్తి చూపని దర్శకులు ఉండరు అనేది మనందరికీ తెలిసిన విషయమే.   

ఏ దర్శకుడైన పవన్ తో వర్క్ చేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తునే ఉంటారు, ఇప్పుడు ఇదే దారిలో బ్లాక్ బస్టర్ దర్శకుడైన బోయపాటి శ్రీను  ఉన్నట్టు సమాచారం. జయ జానకి నాయక తో కమర్షియల్ హిట్ అందుకున్న బోయపాటి తను తరువాత చేయబోయే సినిమాల పైన దృష్టి పెట్టారంట.

అందులో భాగంగానే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు బోయపాటిని సంప్రదించగా, తనకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ఉందని, ఆయనకీ తగ్గ కథ తన వద్ద ఉందని సదరు నిర్మాతలకి చెప్పారట.

ఇక మైత్రి మూవీ మేకర్స్ వద్ద పవర్ స్టార్ డేట్స్ ఉన్నట్టు  అందుకోసమే తనని వారు సంప్రదించినప్పుడు బోయపాటి వారి ముందు ఈ ప్రోపోజల్ పెట్టినట్టు తెలుస్తున్నది.

మరీ ఈ ప్రోపోజల్ కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్