ENGLISH

బోయపాటితో చరణ్‌: మాస్‌ ఊర మాస్‌

29 August 2017-17:08 PM

బోయపాటి సినిమాలంటే మాస్‌కి పెట్టింది పేరు. యాక్షన్‌ సీన్స్‌, డైలాగ్స్‌ అన్నీ మాస్‌ జనాన్ని ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయకా' అదే మాస్‌ ఫార్ములాతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. తర్వాత బోయపాటి చేయబోయే సినిమా ఎవరితో అనుకుంటున్నారా? మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'రంగస్థలమ్‌ 1985' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్‌ తన గెటప్‌ మొత్తం మార్చేశారు. బాడీ లాంగ్వేజ్‌ కూడా టోటల్‌ ఛేంజ్‌ అయిపోయింది. 1985 కాలం నాటి లవ్‌ స్టోరీ ఈ సినిమా కథాంశం మరి. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే చరణ్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఆ సినిమా మాస్‌ టచ్‌ ఉన్నా, క్లాస్‌ మూవీనే అవుతుంది. 'రంగస్థలమ్‌' ఎలాగూ డిఫరెంట్‌ జోనర్‌ మూవీ. ఇక బోయపాటితో చరణ్‌ చేయబోయే సినిమా పక్కా ఊర మాస్‌ సినిమా అవుతుందని అంటున్నారు. అంతేకాదు 'ధృవ' కూడా క్లాస్‌ మూవీనే. 'ధృవ' తర్వాత చరణ్‌ నుండి ఇంతవరకూ సినిమా రాలేదు. 'రంగస్థలమ్‌' కోసం చాలానే గ్యాప్‌ తీసుకున్నాడు చరణ్‌. అందుకూ ఆ గ్యాప్‌ని కవర్‌ చేసేందుకే వరుసగా ఈ రెండు సినిమాలను సెట్స్‌ మీదికి తీసుకెళ్లే యోచనలో చరణ్‌ ఉన్నాడట. కొరటాల సినిమా ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేసేసి, ఆ తర్వాత వెంటనే బోయపాటి సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నాడట రామ్‌ చరణ్‌. అబ్బో చెర్రీ సూపర్‌ ఫాస్ట్‌గున్నడు గురూ!

ALSO READ: మహేష్ స్పైడర్ @ 145!!