ENGLISH

'శివ'ని గుర్తు చేసిన 'రాజుగారిగది-2'

29 August 2017-17:06 PM

నాగార్జున హీరోగా తెరకెక్కిన 'శివ' సినిమా అప్పట్లో ఓ సంచలనం. రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ సినిమా యూత్‌ని విశేషంగా ప్రభావితం చేసింది. 'శివ' సినిమాలో నాగార్జున చేతిలో సైకిల్‌ ఛెయిన్‌ ఉంటుంది. ఓ ఫైట్‌ సీన్‌లో, ప్రత్యర్థిని కొట్టడానికి ఉపయోగిస్తాడు నాగార్జున ఆ సైకిల్‌ ఛెయిన్‌ని. అది అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన సన్నివేశం. దాన్ని గుర్తుకు తెచ్చేలా 'రాజుగారిగది-2' ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఇందులో నాగార్జున చేతిలో రుద్రాక్ష మాల కనిపిస్తోంది. ఓంకార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున సైకియాట్రిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. సమంత ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించబోతోంది. నాగార్జున సరసన సీరత్‌కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌ మన్మథుడంటే నాగార్జునే. ఆయన అందం అలాంటిది. అప్పటికీ, ఇప్పటికీ ఒకే రకమైన ఫిట్‌నెస్‌ని మెయింటైన్‌ చేస్తున్నారాయన. అందుకే నాగార్జున కింగ్‌ అయినా కానీ అమ్మాయిలకి మాత్రం మన్మధుడే. లేడీ ఫ్యాన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తూ ఉంటారాయన. ఇదిలా ఉండగా, 'రాజుగారి గది - 2' సినిమాలో నాగార్జున ప్రస్తుత వయసులో సగం ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అంత అందంగా ఉన్నారు మరి. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అశ్విన్‌ వంటి యంగ్‌ హీరోలు, కమెడియన్లు ఉన్నప్పటికీ, వాళ్లంతా నాగార్జున కంటే ఎంతో చిన్న వాళ్లయినప్పటికీ, ఫిట్‌నెస్‌లోనూ, అందంలోనూ ఆయన ముందు తక్కువే అనిపిస్తున్నారు. అది నాగార్జున ప్రత్యేకత. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 'రాజుగారి గది - 2' సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

ALSO READ: మహేష్ స్పైడర్ @ 145!!