ENGLISH

డియర్‌ కోడలా - అక్కినేని ఆనందం

29 August 2017-17:03 PM

'రాజుగారిగది-2' ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని హీరోయిన్‌ సమంత ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. నాగార్జునని 'మామా' అని పేర్కొంటూ పుట్టినరోజు శుభాకాంక్షల్ని కూడా అందించింది సమంత. కోడలు అంత ముద్దుగా, ఆప్యాయంగా, ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తే, మామగారు అక్కినేని నాగార్జున ఉప్పొంగిపోకుండా ఉంటారా? అందుకే అంత ఆప్యాయంగానూ ఆ విషెస్‌ని స్వీకరించి, 'థ్యాంక్స్‌ డియర్‌ కోడలా' అంటూ సమంతకి థ్యాంక్స్‌ చెప్పడం జరిగింది. మామా - కోడలు ఇలా సోషల్‌ మీడియాలో ఒకర్ని ఒకరు అభినందించుకోవడం, కృతజ్ఞతలు తెలుపుకోవడం అక్కినేని అభిమానులకు బోల్డంత ఆనందాన్నిచ్చింది. ఇది ఆఫ్‌ స్క్రీన్‌. ఆన్‌ స్క్రీన్‌లో కూడా లేటెస్టుగా వీరిద్దరూ కలసి నటిస్తున్నారు. 'రాజుగారిగది-2' సినిమాలో నాగార్జునతో పాటు, సమంత కూడా ఓ కీలకమైన పాత్రలో కన్పించబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకో వైపున నాగచైతన్య - సమంతల పెళ్ళి త్వరలో జరగబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గోవాలో ఈ జంట పెళ్లి ముడితో ఒక్కటి కాబోతున్నారు. మరో పక్క సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న 'రంగస్థలమ్‌' సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇందులో సమంత పల్లెటూరి అమ్మాయిలా సరికొత్త గెటప్‌లో కనిపించనుంది.

ALSO READ: తమన్నా రెండు సినిమాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?