ENGLISH

బ్ర‌హ్మీ గీత‌ల్లో.. ఆంజ‌నేయుని ఆనంద‌బాష్ఫాలు

05 August 2020-15:00 PM

బ్ర‌హ్మానందం గొప్ప హాస్య‌న‌టుడే కాదు. చిత్ర‌కారుడు కూడా. ఈమ‌ధ్య లాక్ డౌన్ స‌మ‌యంలో ఆయ‌న గీత‌ల‌కు మ‌రింత ప‌దును పెరిగింది. వీలున్న‌ప్పుడ‌ల్లా, సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా బొమ్మ‌లు వేస్తూ, త‌న‌లోని చిత్రకారుడ్ని బ‌య‌ట‌కు తీసుకొస్తున్నారు. ఈరోజు ఆయోధ్య‌లో రామ‌మంద‌ర నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మీ నుంచి మ‌రో చిత్ర‌రాజం వ‌చ్చింది. త‌న గీతల్లో శ్రీ‌రామాంజ‌నేయుల అనుబంధాన్ని తెలుపుతూ ఓ బొమ్మ గీశారు.

 

ఆంజ‌నేయుని ఆనంద భాష్ఫాలు అంటూ ఆ బొమ్మ‌కి ఓ టైటిల్ కూడా ఇచ్చారు. ఈ చిత్ర‌ప‌టం ఇప్పుడు బ్ర‌హ్మీ అభిమానుల‌తో పాటు.. సినీ ప్రేమికుల్ని ఎంత‌గానో అల‌రిస్తోంది. మీలో ఇంత టాలెంట్ ఉందా సార్‌..? అంటూ బ్ర‌హ్మీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. ఈమ‌ధ్య కాలంలో బ్ర‌హ్మీ వేసిన బొమ్మ‌ల‌న్నీ ఓ చోట చేర్చి, ఎగ్జిబిష‌న్ పెడితే.. ఇంకా బ్ర‌హ్మాండంగా ఉంటుంది. మ‌రి బ్ర‌హ్మీ ఏమంటారో?

ALSO READ: ఎస్‌.పి.బి కి క‌రోనా.. ప్ర‌స్తుతం క్షేమం.