ENGLISH

సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 'బుట్టబొమ్మ'

28 December 2020-15:00 PM

2020లో సూపర్‌ హిట్‌ ఫిలిం అంటే 'అల వైకుంఠపురములో' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఫిలిం ఇది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ఈ సినిమాలో అన్ని పాటలూ చార్ట్‌ బస్టర్స్‌ అనిపించుకున్నాయి. 'రాములో రాములా', 'నీ కాళ్ళను పట్టుకు..', 'ఓ మై గాడ్‌ డాడీ..' పాటలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెల్సిందే.

 

అయితే, 'బుట్టబొమ్మ' పాట ఇంకా ప్రత్యేకం. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లోనే కనిపిస్తుంటుంది. 2020లో ఓ ఊపు ఊపేసిన సౌత్‌ సినిమా పాటగా 'బుట్టబొమ్మ' ఇప్పటికే రికార్డులకెక్కేసింది.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంది. బాలీవుడ్‌ నుంచి కోలవుడ్‌ దాకా.. అన్ని భాషల్లోనూ ఈ పాటకి ప్రత్యేకంగా అభిమానులు వున్నారంటే అది అతిశయోక్తి కాదేమో. ఆయా సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, ఈ 'బుట్టబొమ్మ' పాటకి స్టెప్పులేస్తూ, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

 

విదేశాల్లోనూ ఈ పాటకి విపరీతమైన క్రేజ్‌ కనిపిస్తోంది. పూజా హెగ్దే క్యూట్‌ గ్లామర్‌.. అల్లు అర్జున్‌ గ్రేస్‌తో వేసిన స్టెప్పులు.. ఇలా ఒకటేమిటి.? 'బుట్టబొమ్మ' పాటకి అన్నీ ప్లస్సులే. మ్యూజిక్‌, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ.. అన్నీ పెర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాయి. అందుకే, 2020లో వచ్చిన అన్ని పాటలకంటే 'బుట్టబొమ్మ' ముందుంది మ్యూజిక్‌ లవర్స్‌ని ఆకట్టుకోవడంలో.

ALSO READ: మ‌హేష్‌తో దీపికా ప‌దుకొణె