ENGLISH

శ్రీముఖి అలా ఎలా చేసిందబ్బా.?

28 December 2020-14:21 PM

నాని 'జెంటిల్‌మెన్‌' సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ రోల్‌ చేసిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి, ఆ తర్వాత అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపించినా, పూర్తిస్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. తాజాగా శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'క్రేజీ అంకుల్స్‌' విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రోమోస్‌ చూస్తోంటే, అడల్ట్‌ కామెడీ.. అన్నట్లుగా అనిపిస్తోంది. ఇక, ఈ సినిమాలో రాజా రవీంద్ర, మనో, భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్స్‌ని చూస్తేనే కాన్సెప్ట్‌ ఏంటన్నది అర్థమయిపోతోంది. అందాల భామ శ్రీముఖిని చూసి లొట్టలేసుకునే అంకుల్స్‌ పాత్రల్లో నటిస్తున్నారు రాజా రవీంద్ర, భరణి, మనో.

 

శ్రీముఖి లుక్స్‌తోనే చాలా హాట్‌ అప్పీల్‌ పండించేసింది. అయితే, ఆమె అభిమానులు మాత్రం, 'దయచేసి ఇలాంటి పాత్రల్లో కనిపించొద్దు..' అంటూ సోషల్‌ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా వుంది. 'రంగస్థలం' సినిమాలో అనసూయ పాత్ర విషయమై తొలుత నానా యాగీ జరిగింది.

 

కానీ, చివరికి ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత హైలైట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ యాక్టింగ్‌ కెరీర్‌లోనే 'రంగమ్మత్త' పాత్ర వెరీ వెరీ స్పెషల్‌. ఆ స్థాయిలో శ్రీముఖికి, 'క్రేజీ అంకుల్స్‌' సినిమా గుర్తింపు తెస్తుందా.? వేచి చూడాల్సిందే. ఈ సంక్రాంతికి ఈ 'క్రేజీ అంకుల్స్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ALSO READ: మ‌హేష్‌తో దీపికా ప‌దుకొణె