ENGLISH

బిగ్‌బాస్‌లోకి బిగ్‌ స్టార్స్‌ వెళుతున్నారట

26 August 2017-18:17 PM

ఎన్టీయార్‌ హోస్ట్‌ చేస్తోన్న బుల్లితెర బిగ్‌ ప్రోగ్రామ్‌ బిగ్‌ బాస్‌లోకి పెద్ద స్టార్స్‌ ఎంట్రీకి సర్వం సిద్ధమవుతోందని సమాచారమ్‌. తన సినిమా ప్రమోషన్‌ కోసం రానా, బిగ్‌హౌస్‌లోకి సెలబ్రిటీ హౌస్‌మేట్‌గా వెళ్ళి వచ్చాక ఈ షోకి క్రేజ్‌ పెరగడంతోపాటుగా, ఆ సినిమాకి పబ్లిసిటీ పరంగా కూడా కలిసొచ్చింది. తాప్సీ, దేవరకొండ విజయ్‌ తమ సినిమాల ప్రమోషన్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్ళారు. తాజా ఖబర్‌ ఏంటంటే నందమూరి బాలకృష్ణ, మహేష్‌బాబు కూడా బిగ్‌హౌస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారట. ఇది నిజమైతే గనుక బిగ్‌బాస్‌ రియాల్టీ సరికొత్త సంచలనాలమయం అవుతుందనడం నిస్సందేహం. నాగార్జున, చిరంజీవి హోస్ట్స్‌గా వ్యవహరించిన కౌన్‌ బనేగా కరోడ్‌పతికి కూడా ఇలాగే సెలబ్రిటీలు పోటెత్తారు. తద్వారా ఆ రియాల్టీ షోకి పాపులారిటీ పెరిగింది. ఆ షో ద్వారా ఆయా హీరోలు తమ సినిమాల్ని ప్రమోట్‌ చేసుకోవడమూ చూశాం. బాలకృష్ణ 'పైసావసూల్‌' కోసం, మహేష్‌ 'స్పైడర్‌' ప్రమోషన్‌ కోసం బిగ్‌హౌస్‌కి వెళ్ళనున్నారని తెలియవస్తోంది. వెండితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, బుల్లితెరపైనా అంతకు మించిన సంచలనాలతో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఆయన కారణంగానే బిగ్‌బాస్‌ రియాల్టీ షో అనూహ్యమైన పాపులారిటీ దక్కించుకుంటోంది.

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్