ENGLISH

స్వలింగ సంపర్కంపై సినీ ప్రముఖులేమన్నారంటే!

06 September 2018-17:43 PM

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దాంతో అందరికన్నా ముందుగా తెలుగు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోటీ పడి ట్వీట్లేశారు. నిజానికి స్వలింగ సంపర్కుల హక్కుల కోసం సినీ పరిశ్రమ నుంచే కొందరు ముందుగా పెదవి విప్పారు. 

తెలుగులో విష్ణు హీరోగా నటించిన సినిమా 'సూర్యం'లో హీరోయిన్‌గా నటించిన సెలీనా జైట్లీ, ఆ పోరాటంలో ముందుండి అందర్నీ నడిపించేందుకు ప్రయత్నించింది. సుప్రీం తాజా తీర్పుపై 'బాహుబలి'ని బాలీవుడ్‌లో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నుంచి, కాజల్‌ అగర్వాల్‌ వరకు చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. స్వలింగ సంపర్కులకూ సామాన్యులకుండే హక్కులే వుంటాయని న్యాయస్థానం తేల్చి చెప్పడం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే కొందరు మాత్రం, ఈ విషయానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదంటున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోనే ఈ తీర్పు పట్ల అప్పీల్‌ చేసే అవకాశమూ లేకపోలేదని కొందరు తమ వాదన వినిపిస్తుండడం గమనించాల్సిన విషయం. ఆ సంగతి పక్కన పెడితే, ఇటీవలి కాలంలో సినిమాల్లో 'స్వలింగ సంపర్కం' అంశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయి. కామెడీగా కావొచ్చు, సీరియస్‌గా కావొచ్చు. 

ఈ అంశాలపై సినిమాల్లో దక్కుతున్న ప్రాధాన్యతపైనా అభ్యంతరాలు విన్పిస్తుండడం మామూలే.

ALSO READ: 'నోటా' ట్రైలర్‌ కెవ్వు కేక అంతే!