ENGLISH

చరణ్‌ - కొరటాల ఈ సారైనా కుదిరేనా?

27 April 2018-10:35 AM

కొరటాల దర్శకత్వంలో చరణ్‌ ఎప్పుడో నటించాల్సి ఉంది. 'మిర్చి' తర్వాతే చరణ్‌ - కొరటాల కాంబినేషన్‌ సెట్‌ అవ్వాల్సి ఉంది. కానీ కుదరలేదు. చరణ్‌తో ఎలాగైనా సినిమా చేస్తానని కొరటాల శివ అన్నారు. అలాగే చరణ్‌ కూడా కొరటాల దర్శకత్వంలో నటిస్తానని అన్నాడు. అయితే ఈ కాంబినేషన్‌ ఇంకెప్పటికి సెట్‌ అయ్యేనో కానీ, ప్రస్తుతం చరణ్‌, బోయపాటి శీను సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్‌కి కమిటై ఉన్నాడు. సో ఈ మల్టీ స్టారర్‌ కోసం చరణ్‌ సిద్ధం కావాల్సి ఉంది.

ఒకవేళ ఆ తర్వాతేమైనా ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అవుతుందేమో చూడాలి మరి. అయితే రాజమౌళితో చేసేది మల్టీ స్టారర్‌ కాబట్టి, ఈ సినిమా టైంలో కొంచెం గ్యాప్‌ దొరికే ఛాన్సెస్‌ ఉంటాయి. ఒకవేళ ఈ గ్యాప్‌లో కొరటాలకు చరణ్‌ ఛాన్సిచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, కొరటాల సినిమాల నిర్మాణం కూడా చాలా త్వరగా కంప్లీట్‌ అయిపోతుంది. కాబట్టి, ఏకకాలంలో చరణ్‌ ఈ రెండు సినిమాలను హ్యాండిల్‌ చేసే అవకాశం కూడా లేకపోలేదు. 'రంగస్థలం' కోసం చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు చరణ్‌.

'రంగస్థలం' రిలీజ్‌కి ముందే బోయపాటి సినిమా స్టార్ట్‌ అయ్యింది. చరణ్‌ లేకుండానే కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. హీరోయిన్‌, ఇతర నటీనటులపై కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌ని చిత్రీకరించడం జరిగింది. ఇటీవలే చరణ్‌ షూటింగ్‌కి హాజరయ్యాడు. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ALSO READ: నేరం రుజువైతే ప‌వ‌న్‌కి ఏడేళ్లు జైలు