ENGLISH

పిల్లాడు కాదు, చిచ్చరపిడుగేనట

24 August 2017-11:00 AM

చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, యాక్టింగ్‌లో తమదైన శైలితో మెప్పించి, ఇప్పుడు యంగ్‌ హీరోలుగా మారుతున్నారు చాలా మంది బాల నటులు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ కూడా అలా బాలనటుడిగా వచ్చి స్టార్‌ అయిన వాడే. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా 'బాల రామాయణం' సినిమా ద్వారా బాల నటుడుగా మెప్పించి, స్టార్‌గా ఎదిగిన వాడే. ఇప్పుడు ఆ కోవలో మరో బాల నటుడు హీరోగా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేష్‌ వంటి హీరోలకు చిన్నప్పటి హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేసిన మాస్టర్‌ తేజ గుర్తున్నాడు కదా. ఈ కుర్రాడు ఇప్పుడు యంగ్‌ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. చిన్నప్పుడే మనోడి యాక్టింగ్‌ టాలెంట్‌ చూపించేశాడు. స్టార్‌ అవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్‌ తేజలో ఉన్నాయి. డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరింత రాటుదేలాడు. చిరంజీవి హీరోగా నటించిన 'ఇంద్ర' సినిమాతో బాగా పాపులర్‌ అయ్యాడు. మెగాస్టార్‌ చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించి, చిన్నతనంలోనే ఆ పాత్రకి కావాల్సినంత పవర్‌నీ, ఉత్సాహాన్ని చూపించాడు తేజ. ప్రస్తుతం తేజ హీరోగా బెక్కెం వేణుగోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 15 నుండి ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా సత్తా చాటి, సినీ రంగంలో హీరోగానూ ఓ వెలుగు వెలగాలనుకుంటున్న తేజకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేస్తూ, స్టార్‌ హీరో రేంజ్‌కి ఎదగాలని ఆశిద్దాం.

ALSO READ: బిగ్ బీ.. బాలకృష్ణని కాదని చిరుకి ఎందుకు ఓకే అన్నాడో తెలుసా?