ENGLISH

ఎలా మెగాస్టార్‌.. ఇంత వేగమెలా?

24 January 2021-13:26 PM

మెగాస్టార్‌ చిరంజీవి జోరు పెంచేశారు. వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోనున్నారు. రీసెంట్‌గా 153వ చిత్రాన్ని స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌కి ఓ పక్క ప్లానింగ్‌ సిద్ధం చేస్తూనే, మరో పక్క మిగిలిన ప్రాజెక్టుల కోసం కూడా కసరత్తులు జరుగుతున్నాయట. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి చేతిలో దాదాపు ఐదు ప్రాజెక్టులు సిద్దంగా ఉన్నాయి. ఆయన వేగం చూసి, అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆరు పదుల వయసులో మెగాస్టార్‌ ఉత్సాహానికీ, వేగానికీ అభిమానులతో పాటు, సినీ దిగ్గజాలు కూడా అవాక్కవుతున్నారు.

 

వీలైనంత త్వరగానే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్‌ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. 'తనీఒరువన్‌' ఫేమ్‌ మోహన్‌ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్‌' రీమేక్‌ నిర్మితమవుతోంది. అలాగే తమిళ రీమేక్‌ 'వేదాళం'కు సంబంధించి గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ అవుతోంది. చిరంజీవితో సినిమా చేసేందుకు మెహర్‌ రమేష్‌, బాబీ వంటి దర్శకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కాస్టింగ్‌ వర్క్‌ కోసం ఓ స్పెషల్‌ టీమ్‌ పని చేస్తోందట.

 

ఇదిలా ఉంటే, తాజాగా ఓ యంగ్‌ డైరెక్టర్‌కీ చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చారనీ సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చేసినట్లే. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ రెండోసారి ఈ సినిమా కోసం మెగాస్టార్‌తో స్టెప్పులేస్తోంది.

ALSO READ: ప్రబాస్‌ 'సలార్‌'లో టాలీవుడ్‌ యంగ్‌ హీరో?