రేపు (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరు నుంచి కొత్త సినిమాల కబుర్లు రాబోతున్నాయి. చిరు టైటిళ్లేంటో.. తేలబోతున్నాయి. చిరంజీవి - బాబి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రానికి `వీరయ్య` అనే పేరు ఖాయం చేశారని ఇన్‌సైడ్ వర్గాల టాక్. చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది.
`వేదాళం`కి ఇది రీమేక్. దీనికి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా చిరు పుట్టిన రోజునే వదలబోతున్నారు. మరోవైపు చిరు - మోహన్ రాజా కాంబినేషన్ లో ఓ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. దీనికి `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ టైటిల్ కూడా రేపే రివీల్ చేయబోతున్నారు. సో.. చిరు అభిమానులకు త్రిపుల్ ధమాకా అన్నమాట.
ALSO READ: RRR వచ్చేది అప్పుడేనా?