ENGLISH

త్వరలో నితిన్ `మాస్ట్రో` ట్రైల‌ర్‌!

20 August 2021-17:12 PM

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

 

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న `మాస్ట్రో` చిత్రం కోసం డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్‌.

 

నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై జ‌బ్ క్రియేట్ చేశాయి.

ALSO READ: నాని - నితిన్ ల ఓటీటీ ఫైట్‌