ENGLISH

మెగాస్టార్ ని ప‌ట్టేసిన మారుతి

03 August 2021-13:23 PM

మారుతికి మెగా కాంపౌండ్ తో మంచి అనుబంధం ఉంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌, అల్లు శిరీష్ ల‌తో సినిమాల్ని తెర‌కెక్కించాడు మారుతి. అంతేనా..? గీతా ఆర్ట్స్ త‌న హోం బ్యాన‌ర్ లాంటిది. అందులో మూడు సినిమాల్ని తీశాడు. ఇప్పుడు తీస్తున్న `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` కూడా గీతా ఆర్ట్స్ 2లో రూపొందుతోందే. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు మారుతి. అందుకోసం క‌థ‌ల్నీ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అవును.. చిరంజీవి - మారుతి కాంబినేష‌న్ లో ఓ సినిమా దాదాపు ఖాయ‌మ‌న్న‌ది టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్‌.

 

ఇటీవ‌ల చిరంజీవి - మారుతి ల మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ని, ఈ సంద‌ర్భంగా చిరుకి మారుతి ఓ క‌థ వినిపించాడ‌ని టాలీవుడ్ టాక్‌. మారుతి చెప్పిన క‌థ చిరుకి బాగా న‌చ్చింద‌ని, వెంట‌నే ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్ నే ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో బిజీగా ఉన్నాడు మారుతి. అది అవ్వ‌గానే.. చిరు సినిమానే మొద‌లెట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాతో మారుతి బిగ్ లీగ్ లోకి చేరిపోయిన‌ట్టే.

ALSO READ: సోనూకి రాజ‌కీయ గాలం... అయినా లొంగేదే లే!