ENGLISH

అంజనా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో మెగాస్టార్‌ సినిమా?

29 October 2020-16:00 PM

మెగాస్టార్‌ చిరంజీవి సొంత బ్యానర్‌ అంజనా ప్రొడక్షన్స్‌ వ్యవహారాల్ని నాగబాబు చూస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, గత కొంతకాలంగా అంజనా ప్రొడక్షన్స్‌ నిర్మాణ వ్యవహారాల్లో వెనకబడిపోయింది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆ బ్యానర్‌లో మెగా ఉత్సాహం నింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే చిరంజీవి హీరోగా అంజనా ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఓ సినిమా నిర్మితం కానుందట.

 

అయితే, అంజనా ప్రొడక్షన్‌కి తోడుగా మరో బ్యానర్‌ ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటుందనీ, ఆ బ్యానర్‌ ఇంకోటేదో కాదు కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ అనీ ప్రచారం జరుగుతోంది. నిజానికి మెగా బ్రదర్‌ నాగబాబు పుట్టినరోజైన నేడే ఈ విషయమై ఓ ప్రకటన రాబోతోందన్న గుసగుసలు వినిపించాయి. అయితే, కొన్ని కారణాలతో అది వాయిదా పడిందట. ఇదిలా వుంటే, అంజనా ప్రొడక్షన్స్‌ వ్యవహారాలు ఇకపై నాగబాబు కుమార్తె నిహారిక చూసుకోనుందనేది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందులోన్న సమాచారం. ఈ విషయమై మెగా బ్రదన్‌ నాగబాబు స్పందన కోసం మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఇదే అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో పలు విజయవంతమైన సినిమాలొచ్చాయి. ‘ఆరెంజ్‌’ సినిమా వివాదానికి సంబంధించి తరచూ అంజనా ప్రొడక్షన్స్‌ పేరు వార్తల్లోకెక్కుతున్న విషయం విదితమే.

ALSO READ: చిత్రీకరణ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ నాంది!