ENGLISH

మెగాస్టార్‌ టూ మెగా పవర్‌ స్టార్‌

07 March 2017-19:02 PM

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పనిచేశారు ఆయన కుమార్తె సుస్మిత. ఇప్పుడు ఆమె తన సోదరుడు రామ్‌చరణ్‌ కోసం కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మారుతున్నారు. చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం సుస్మితను కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా ఎంపిక చేసినట్లు తెలియవస్తోంది. సుస్మిత, విదేశాల్లో కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌పై గతంలో శిక్షణ పొందారు. చిరంజీవి హీరోగా నటించిన 'జై చిరంజీవ' సినిమా కోసం కూడా ఆమె కొన్ని కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి పనిచేశారామె. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ హీరోగా సుకుమార్‌ సినిమా తెరకెక్కిస్తుండడంతో, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేటివిటీకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ ఉండాలి. దాంతో ఈ విషయాన్ని సుస్మిత ఛాలెంజింగ్‌గా తీసుకున్నారని సమాచారమ్‌. కొన్ని కాస్ట్యూమ్స్‌ని సుస్మిత డిజైన్‌ చేసి, సుకుమార్‌కి చూపించడంతో ఆయన ఆమోద ముద్ర వేశారట. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మంచి పేరుతెచ్చుకున్న సుస్మిత, చరణ్‌ సినిమాతో ఇంకా పెద్ద పేరు తెచ్చుకుంటారని మెగా కాంపౌండ్‌ ఆశాభావంతో ఉంది. రచయిత కోన వెంకట్‌ సతీమణి, దర్శకుడు శ్రీనువైట్ల సతీమణి ఇలా పలువురు సినీ ప్రముఖులు కుటుంబాల నుంచి ఔత్సాహికులైనవారు కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌ని ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం గొప్ప విషయమే కదా.