ENGLISH

సుచి లీక్స్‌ చెత్త ప్రకంపనలు

07 March 2017-18:58 PM

సింగర్‌ సుచిత్ర పేరుతో సోషల్‌ మీడియాలో అడల్ట్‌ కంటెంట్‌ యధేచ్ఛగా చెలామణీ అవుతోంది. సెలబ్రిటీల న్యూడ్‌ ఫొటోలు, న్యూడ్‌ వీడియోలకు ఉండే క్రేజ్‌ చాలా ఎక్కువ. అవి ఫేక్‌ అని తెలిసినా, కొందరికి అవంటే చాలా ఇంట్రెస్ట్‌. దాన్ని క్యాష్‌ చేసుకోడానికి సినీ తారల్ని బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నటున్నారు. తమిళ, తెలుగు సినీ పరిశ్రమకి చెందిన కొందరు ప్రముఖ నటీనటుల పేర్లతో సోషల్‌ మీడియాలో సుచి లీక్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో అడల్ట్‌ కంటెంట్‌పై బ్యాన్‌ విధించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉండగా, ఈ డిమాండ్ల మేరకు కొన్ని వెబ్‌సైట్లను ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు బ్యాన్‌ చేశారు. అయితే సోషల్‌ మీడియాలో ఇంటివి బ్యాన్‌ చేయడం కష్టం. దాంతో అక్రమార్కులకు ఎదురే లేకుండా పోతోంది. 'ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు - అవి మావి కావు' అని చెప్పడం కూడా అసభ్యకరంగా అనిపిస్తుంది కొందరికి. ఎందుకంటే అంత అసభ్యకరమైన వీడియోలు అవి. ఒక్కటి కాదు పదుల సంఖ్యలో అలాంటి వీడియోలు వస్తున్నప్పుడు ప్రతిసారీ వాటిని ఖండించడం సెలబ్రిటీలకు సాధ్యం కాదు. వ్యక్తిగతంగా తమ సన్నిహితులతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టడం సెలబ్రిటీలకు అలవాటే. వాటిని మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో వాటిని పెట్టి శునకానందం పొందడం శోచనీయం. ఏదేమైనా సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ఈ దురాగతాన్ని ఖండించవలసి ఉంటుంది.

 

ALSO READ: విద్యాబాలన్‌ మరీ ఇంత హాట్‌గానా?