ENGLISH

'బాహుబలి' కమింగ్‌ - రికార్డులు బద్దలైపోవాలె

07 March 2017-17:04 PM

'బాహుబలి' ట్రైలర్‌ వచ్చేస్తోందన్న వార్త తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా నయా ఈక్వేషన్స్‌కి తెరలేపింది. ఎందుకంటే 'బాహుబలి'కి ఉన్న క్రేజ్‌ అలాంటిది. ట్రైలర్‌ వస్తే సోషల్‌ మీడియాలో ఇప్పటికి ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయంటున్నారు. యూ ట్యూబ్‌ హిట్స్‌, లైక్స్‌ పరంగా 'బాహుబలి'కి ఎదురే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది యూనివర్సల్‌ సినిమా. అన్ని భాషల్లోనూ సినీ ప్రేమికులు 'బాహుబలి' కోసం ఎదురుచూస్తున్నారు. బిజినెస్‌ పరంగా 'బాహుబలి' సంచనాలకు ఆకాశమే హద్దు అని అందరికీ తెలిసిన సంగతే. జస్ట్‌ కొన్ని రోజులే, 'బాహుబలి' ది కంక్లూజన్‌ తాలూకు ట్రైలర్‌ వచ్చేయనుంది. ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు. యావత్‌ ప్రపంచం ఈ సినిమా కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. జస్ట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌కే బోలెడంత క్రేజ్‌ వచ్చేసింది. ఈ తరుణంలో రాబోతున్న ఈ ట్రైలర్‌తో ఇన్నాళ్ళ ఎదురుచూపులు కాస్త తగ్గుతాయి. సినిమా కోసం ఎదురుచూపులు మళ్ళీ మామూలే అనుకోండి. ఈ లోగా రాజమౌళి అండ్‌ టీం సినీ ప్రమోషన్స్‌ షురూ చేసేసింది. తొలి పార్ట్‌కి మించి రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఉంటుందట. ఆ రకంగా రాజమౌళి అండ్‌ టీమ్‌ కసరత్తులు మొదలెట్టేసిందట. ఇప్పటికే ప్రబాస్‌, రాజమౌళి పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌ ద్వారా మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్‌ చాలా అద్భుతంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. తొలి పార్ట్‌ కేవలం పాత్రల పరిచయాలు మాత్రమే. కానీ అసలు కథ అంతా రెండో పార్ట్‌లోనే ఉందని ప్రబాస్‌ చెప్పాడు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ALSO READ: ప్రేమతో మీ కార్తీక్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన