ENGLISH

చిరు వినాయక్ కి ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలుసా?!

08 March 2017-19:08 PM

మెగా ఫ్యామిలీతో వినాయ‌క్ బంధం విడ‌దీయ‌రానిది. చిరంజీవి, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌తో సినిమాలు చేశారాయ‌న‌. చిరుని అన్న‌య్యా.. అంటూ ప్రేమ‌గా పిలుస్తాడు. చిరు కూడా వినాయ‌క్‌ని సొంత త‌మ్ముడిలా భావిస్తాడు. త‌న 150వ సినిమా కోసం ఎంత‌మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించినా.. చిరు మాత్రం వినాయ‌క్ ని న‌మ్మాడు. వినాయ‌క్ కూడా త‌న పై పెట్టుకొన్న న‌మ్మ‌కాన్ని నూటికి నూరుపాళ్లూ నిల‌బెట్టి, చిరు 150వ సినిమాకి వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చాడు. టాలీవుడ్ నెం.2 గ్రాస‌ర్‌గా నిల‌బెట్టాడు. అందుకే చిరు ఇప్పుడు వినాయ‌క్‌కి ఓ ఊహించ‌ని బహుమ‌తి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. చిరు వినాయ‌క్ కోసం ఓ ఖ‌రీదైన కారు కొన్నాడ‌ని, త్వ‌ర‌లోనే వినాయ‌క్ చేతికి అది చేరిపోనుంద‌ని టాక్‌. అన్న‌ట్టు.. ఈ చిరు 150వ సినిమా కోసం వినాయ‌క్‌కి చాలా త‌క్కువ పారితోషికం ఇచ్చార‌ట‌. వినాయ‌క్ కూడా అన్న‌య్య సొంత సినిమా అని పారితోషికం విష‌యంలో రాజీ ప‌డిపోయాడ‌ట‌. అప్పుడు త‌క్కువగా ఇచ్చిన పారితోషిక‌మే.. ఇప్పుడు కారు రూపంలో బ‌హుమానంగా ఇస్తున్నార‌ని సమాచారం. అలా.. వినాయ‌క్ రుణం తీర్చుకోవాల‌ని చిరు, చ‌ర‌ణ్‌లు డిసైడ్ అయిపోయార‌న్నమాట‌.