ENGLISH

మెగా ఫ్యాన్స్ లో గుబులు మొద‌లు

07 August 2020-13:10 PM

హీరోలంతా `హిట్` వెంటే ప‌డుతుంటారు. హిట్ ఉన్న ద‌ర్శ‌కుడితో, హిట్ కాంబినేష‌న్ సెట్ చేసుకుంటారు. అది చాలా స‌హ‌జం. ఏరి కోరి ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి, అస‌లు రేసులోనే లేనివాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌రు. కానీ చిరంజీవి మాత్రం ఏరి కోరి మెహ‌ర్ ర‌మేష్ తో ప‌నిచేయ‌డానికి రెడీ అయ్యారు. ఇదే మెగా ఫ్యాన్స్ లో గుబులు రేపుతోంది. `మెహ‌ర్ ర‌మేష్ తో ఓ సినిమా చేసే అవ‌కాశం ఉంది` అంటూ అప్పుడెప్పుడో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు చిరు. దాంతో మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డ్డారు. మెహ‌ర్‌కి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. అయితే... చిరు దాన్ని మ‌ర్చిపోతాడేమో అని కాస్త లైట్ తీసుకున్నారు.


అయితే ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్‌ప్రాజెక్టు మెల్ల‌గా ముందుకు క‌దులుతోంది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం చిత్రాన్ని తెలుగులో చిరు రీమేక్ చేయ‌డానికి రెడీ అయ్యారు. ఈ రీమేక్‌కి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. వేదాళం చాలా స్టైలీష్‌గా ఉంటుంది. అలాంటి సినిమాల‌కు మెహ‌ర్ న్యాయం చేస్తాడ‌ని చిరు భావిస్తున్నారు. అందుకే.. ప్ర‌స్తుతం వేదాళం రీమేక్ బాధ్య‌త‌ని మెహ‌ర్ చేతిలో పెట్టార‌ని టాక్‌. దాంతో.. మెగా ఫ్యాన్స్ మ‌ళ్లీ టెన్ష‌న్‌ప‌డుతున్నారు. ఇంత‌మంది ద‌ర్శ‌కులు ఉండ‌గా.. చిరు దృష్టి మెహ‌ర్‌పైనే ఎందుకు ప‌డిందో మ‌రి. 

ALSO READ: ఫ్యాన్స్‌కి మ‌హేష్ రిక్వెస్ట్‌