ENGLISH

ఫ్యాన్స్‌కి మ‌హేష్ రిక్వెస్ట్‌

07 August 2020-12:24 PM

ఆగ‌స్టు 9 మ‌హేష్‌బాబు పుట్టిన రోజు. ప్ర‌తీ పుట్టిన రోజుకీ సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌... సంబ‌రాలు చేసుకోవ‌డం మామూలే. ఈసారీ ఆ సంద‌డి మొలైపోయింది. అయితే  త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా  మ‌హేష్‌బాబు అభిమానుల‌కు ఓ విన్న‌పం చేశాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో.. వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని, అభిమానులు ఇంటి ద‌గ్గ‌రే ఉండాల‌ని సూచించాడు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న చేశాడు మ‌హేష్‌.


``మీరంద‌రూ నాకు తోడుగా ఉండ‌డం నా అదృష్టం. నా పుట్టిన రోజు ప్ర‌త్యేకంగా ఉండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో సుర‌క్షితంగా ఉండ‌డ‌మే అన్నింటికంటే ముఖ్యం. కాబ‌ట్టి.. ఇంటి ద‌గ్గ‌రే ఉండండి. సుర‌క్షితంగా ఉండండి` అంటూ ట్వీట్ చేశాడు.  మ‌హేష్ తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌` త్వ‌ర‌లో సెట్స్‌పై వెళ్ల‌డానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఏమైనా మ‌హేష్ పుట్టిన రోజు కానుక‌గా వ‌స్తుందేమో చూడాలి. 

ALSO READ: మహేష్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోందోచ్..!