ENGLISH

మహేష్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోందోచ్..!

07 August 2020-10:43 AM

స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు ఇవ్వడం సాధారణమే. అభిమానులు కూడా అలాంటి అప్డేట్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.  ఆగస్టు 9వ తారీఖున సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.  దీంతో మహేష్ బాబు కొత్త సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 


పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ లాంటిది రిలీజ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పరశురామ్ కూడా తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.


పరశురామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "వర్క్ జోరుగా సాగుతోంది. సూపర్ ఫ్యాన్స్ కోసం ఈ అవుట్ పుట్ అందించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజిక్ స్టూడియో లో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న ఒక ఫోటోను కూడా పోస్ట్ చేయడం విశేషం. మరి తమన్ తన మ్యూజిక్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో!

ALSO READ: ఉప్పెన హీరోకు రెండోది ఫిక్స్!