చిరంజీవి `లూసీఫర్` రీమేక్ ని ఇటీవలే మొదలెట్టాడు. మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా కోసం చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో `గాడ్ ఫాదర్` టైటిల్ గా ఆల్మోస్ట్ ఫిక్సయిపోయిందని, ఈనెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ బాగుండడంతో.. ఫ్యాన్స్ కూడా `లూసీఫర్` రీమేక్ కి టైటిల్ దొరికేసిందనుకున్నారు. ఆగస్టు 22న ఈ టైటిల్ ప్రకటించడం లాంఛనమే అనుకున్నారు. ఇంతలో ఈ టైటిల్ విషయంలో కొత్త ట్విస్టు వచ్చింది.
ఈ సినిమాకి `గాడ్ ఫాదర్` అన్నది టైటిల్ కాదని, ఇంకో కొత్త టైటిల్ ప్రకటిస్తారన్న వార్త షికారు చేస్తోంది. `హంటర్` అనే టైటిల్ ని ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారని, చిరు పుట్టిన రోజున దీన్నే టైటిల్ గా ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. హంటర్ అనే టైటిల్ కూడా బాగానే ఉంది. గాడ్ ఫాదర్ అన్నది ఫేమస్ టైటిల్. పైగా.. ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గాడ్ ఫాదర్ అనే పేరు పెడితే, హాలీవుడ్ క్లాసిక్ టైటిల్ ఎంచుకుని అంచనాలు పెంచినవాళ్లవుతామన్నది చిత్రబృందం భయం. అందుకే మరో టైటిల్ ని ఆప్షన్ గా ఉంచుకున్నారు. మరి ఈ రెండు టైటిళ్లలో చివరికి ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి.
ALSO READ: 'క్రేజీ అంకుల్స్' మూవీ రివ్యూ & రేటింగ్!