ENGLISH

ఫృథ్వీ రేంజ్ పెరిగింది.. పారితోషికం ఎంతో తెలుసా?

06 March 2017-10:54 AM

ఈమధ్య ఏ సినిమా చూసినా... క‌మిడియ‌న్ గ్యాంగ్‌లో ఫృథ్వీనే క‌నిపిస్తున్నాడు. ఈ వారం మూడు సినిమాలు విడుద‌లైతే.. మూడింట్లోనూ ఫృథ్వీ ఉన్నాడు.  కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త స‌క్సెస్‌లో ఫృథ్వీ పండించిన రేచీక‌టి హాస్యం... కీల‌క పాత్ర పోషిస్తోంది. ఫృథ్వీ క్యారెక్ట‌ర్ 10 నిమిషాలు వ‌ర్క‌వుట్ అయితే చాలు, ఆ సినిమాలో కామెడీకి ఢోకా లేన‌ట్టే అనే న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంది. డిమాండ్‌కి త‌గ్గ‌ట్టే.. ఫృథ్వీ రెమ్యున‌రేష‌న్ కూడా రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. లౌక్యం సినిమాకి ముందు... ఫృథ్వీ పారితోషికం వేల‌ల్లో ఉండేది.  ఆసినిమాతో ఒక్క సారిగా దూసుకొచ్చేశాడు ఫృథ్వీ. ఇప్పుడు ఈ 30 ఇయ‌ర్స్ ఇండ్ర‌స్ట్రీ పారితోషికం ఎంతో తెలుసా?  ఒక్క రోజుకి రెండు ల‌క్ష‌లు.  ఫృథ్వీ డైరీలో 30 రోజులూ ముందుగానే నిండిపోతున్నాయ‌ని, ప్ర‌స్తుతం ఇండ్ర‌స్ట్రీలో ఉన్న క‌మిడియ‌న్ల‌లో ఇంత బిజీగా ఉన్న‌ది ఫృథ్వీ ఒక్క‌డే అని  స‌న్నిహితులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఒక్కో సీజ‌న్‌ని ఒక్కో హాస్య న‌టుడు లీడ్ చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఫృథ్వీ సీజ‌న్ న‌డుస్తోంది. అందుకే ఇంత డిమాండ్‌.

ALSO READ: అఖిల్ పెళ్లి... ఇంకా ఛాన్సుందా??