ENGLISH

అఖిల్ పెళ్లి... ఇంకా ఛాన్సుందా??

06 March 2017-10:48 AM

అఖిల్ బ్రేక‌ప్ అటు చిత్ర‌సీమ‌లోనూ, ఇటు మీడియాలోనూ హాట్ వ్య‌వ‌హారంగా మారింది.  జాతీయ మీడియా కూడా అఖిల్ - శ్రియా రెడ్డి బ్రేక‌ప్ విష‌యాన్ని హెడ్ లైన్స్‌కి చేర్చింది. వీరిద్ద‌రూ ఎందుకు విడిపోయారు?  ఏం జ‌రిగింది?  అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. అయితే.. అఖిల్ - శ్రియాల పెళ్లి క్యాన్సిల్ కాలేద‌ని, ఇప్ప‌టికీ... ఛాన్సుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నాగ్ ఫ్యామిలీకీ, జీవీకే ఫ్యామిలీకి ఇప్ప‌టికీ సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని..  వాళ్లిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిరే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇండ్ర‌స్ట్రీకి చెందిన కొంత‌మంది నాగ్ త‌ర‌పున‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌ని, అటు నుంచి కూడా మెత్త‌బ‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని, అందుకే ఈ బ్రేక‌ప్ వ్య‌వ‌హారంలో మీడియాలో ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. నాగ్ స్పందించ‌లేద‌ని చెప్పుకొంటున్నారు. సో.. ఈ బ్రేక‌ప్ కాస్త‌... మ‌ళ్లీ ప్యాచ‌ప్‌గా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న‌మాట‌.