ENGLISH

శ్రీ‌నివాస్‌తో శ్రీ‌వాస్

06 March 2017-10:39 AM

అల్లుడు శీను తో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. తొలి సినిమాకే వి.వి.వినాయ‌క్‌తో క‌ల‌సి ప‌నిచేసే అవ‌కాశం అందుకొన్నాడు. ఇప్పుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. త‌న నాలుగో సినిమా కూడా దాదాపుగా ఖాయ‌మైంది. ఈ  చిత్రానికి శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. డిక్టేట‌ర్ త‌ర‌వాత శ్రీ‌వాస్ నుంచి సినిమాలేం రాలేదు. విశాల్ తో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నా అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు బెల్లం కొండ శ్రీ‌నివాస్‌కి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అది బెల్లం కొండ‌కు విప‌రీతంగా న‌చ్చింద‌ని, వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. బోయపాటి శ్రీ‌ను సినిమా పూర్త‌యిన వెంట‌నే... శ్రీ‌వాస్ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: SUCHI LEAKS TEACH LIFETIME SEX LESSONS