తమిళ కథానాయకుడు సూర్యకు ఐటీ ట్రిబ్యునల్ కోర్ట్ షాకిచ్చింది. ఐటీశాఖకు సూర్య రూ.3 కోట్లు రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. దాదాపు పదేళ్ల క్రితం ఆదాయపు పన్ను అధికారులు చెన్నైలోని సూర్య ఇంటిలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని లెక్కగట్టిన ఐటీ శాఖ, ఎగ్గొట్టిన పన్నుల నిమిత్తం రూ.3 కోట్ల 12 లక్షలు ఫైన్ గా వేసింది. ఈ విషయంలో సూర్య కోర్టు మెట్లెక్కారు. ఆ పన్నులు ఎప్పటివో అని, పన్ను విధించడంలో ఐటీ శాఖ మూడేళ్లు ఆలస్యం చేసిందని, కాబట్టి ఈ పన్ను మినహాయింపు కోరుతూ 2018లో సూర్య హై కోర్టులో కేసు వేశారు.
ఈ కేసు విషయంలో తాజాగా వాదోపవాదాలు జరిగాయి. బుధవారం ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జ్ ఎస్.ఎం.సుబ్రమణ్యం పిటిషన్‌ను తోసిపుచ్చారు. సూర్య పన్ను తిరిగి చెల్లించాల్సిందే అని.. అయితే ఆ పన్నులో వడ్డీ నుంచి మినహాయిస్తున్నట్టు తీర్పు చెప్పింది. నిజానికి పన్ను చెల్లించే విషయంలో తమిళ నటులు చాలా ఉదాసీనంగా ఉంటారు. అప్పట్లో రజనీకాంత్, మొన్నమధ్య విజయ్, ధనుష్.. పన్ను మినహాయించాలని కోర్టు మెట్లెక్కి చివాట్లు తిన్నారు. ఇప్పుడు సూర్య వంతు వచ్చిందంతే.
ALSO READ: మెగా ఫ్యాన్స్ చూపు.. ఆగస్టు 22 వైపు!