కాజల్ చెల్లిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్ కి మంచి ఆఫర్లే వచ్చాయి. ఒకట్రెండు హిట్ సినిమాల్లో చోటు దక్కింది. దాంతో ఓకే అనిపించుకుంది. అయితే ఆ తరవాత పెళ్లి చేసుకుని సైలెంట్ అయిపోయింది. అయితే ఈమధ్య సోషల్ మీడియా సాక్షిగా హడావుడి మొదలెట్టింది. కొన్ని హాట్ ఫొటో షూట్లతో హీట్ పుట్టించింది. సడన్ గా.. నిషాకి ఏమైందంటూ.. ఆరాలు మొదలయ్యాయి. అయితే... ఇదంతా తన రీ ఎంట్రీలో భాగమని తెలుస్తోంది.
ఇటీవల ఓటీటీల హవా బాగా పెరిగింది. మాజీ హీరోయిన్లని సైతం వెదికి పట్టుకుని, వాళ్లకు ఛాన్సులిస్తున్నాయి ఓటీటీ ఛానళ్లు. తాజాగా.. నిషా అగర్వాల్ ని ఓ ఓటీటీ సంస్థ సంప్రదించినట్టు టాక్. ఓ వెబ్ సిరీస్ లో తనకు ఓ కీలకమైన పాత్ర అప్పజెప్పార్ట. రెమ్యునరేషన్ టెమ్టింగ్ గా ఉండడంతో నిషా కూడా ఓకే అనేసిందని టాక్. మరోవైపు వెంకీ - రానాలతో నెట్ ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తోంది. అందులోనూ నిషాకి ఓ మంచి పాత్ర పడిందని తెలుస్తోంది. సో.. నిషా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైందన్నమాట.
ALSO READ: Nisha Agarwal Latest Photoshoot