ENGLISH

దీక్షా చేసిన సంచలన వ్యాఖ్యలు

21 September 2017-18:36 PM

బిగ్ బాస్ హౌస్ లో నుండి పోయిన వారమే నిష్క్రమించిన దీక్షా పంత్.. ఆ ఇంటిలో తనకి జరిగిన అవమానాలు అలాగే ఎవరెవరు తనని టార్గెట్ చేసి మరి ఏడిపించారు అని వివరంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. 

అదే కాకుండా ప్రత్యేకించి కమెడియన్ ధనరాజ్ పైన  ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి. ఇదే ఇంటర్వ్యూ తను బిగ్ బాస్ హౌస్ లో ఎలా గడిపాను తనని ఎవరెవరు సపోర్ట్ చేసారు ఎవరెవరు చేయలేదు అన్న వివరాలు అన్ని వివరంగా చెప్పింది.

ఇక ఇంకొక మూడు రోజుల్లో బిగ్ బాస్ హౌస్ ఫైనల్స్ జరగనున్న నేపధ్యంలో దీక్షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

ALSO READ: జై లవకుశ మూవీ రివ్యూ & రేటింగ్స్