ENGLISH

ష్‌.! తనీష్‌కి 'రంగు' పడింది.!

12 September 2018-16:57 PM

బుల్లితెర ప్రేక్షకుల్ని ఆశాంతం అలరించకపోయినా, గత 93 రోజులుగా ఓ మోస్తరు ఎంటర్‌టైన్‌ చేస్తోన్న 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. ఈ తరుణంలో బిగ్‌బాస్‌ వీక్షకులు ఈ షో పట్ల మరింత ఆశక్తిగా ఎదురు చూస్తోంది. బిగ్‌బాస్‌ విజేత కౌషల్‌ కావచ్చు అనే భావన ఉన్నా మరోవైపు అలాగే జరుగుతుందా? ఇంకేమైనా జరగొచ్చా.? అని రకరకాల ప్రశ్నలు అందర్నీ తొలిచేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోని కదలనీయకుండా కూర్చోబెట్టి చూసేందుకు అవకాశం కల్పిస్తున్న కీలక కంటెస్టెంట్‌ కౌషల్‌. కౌషల్‌పై మిగిలిన ఇంటి సభ్యులు చూపిస్తున్న వివక్ష, అయినా కానీ ఎటూ చలించని ఆయన ఆటిట్యూడ్‌. ఏదో ఒక రకంగా ఆయన ఆటిట్యూడ్‌ని దెబ్బ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఇంటి సభ్యులందరిలోకెల్లా అతి కీలక సభ్యుడు తనీష్‌కి తాజాగా కౌంటర్‌ పడింది. అయితే కౌషల్‌ నుండి కాదు. 

బిగ్‌హౌస్‌లో తనీష్‌, మరో కంటెస్టెంట్‌ అయిన దీప్తిని అమ్మ అని పిలుస్తుంటాడు.. తెలిసిన సంగతే. అయితే అమ్మ అంటూనే దీప్తి పట్ల తనీష్‌ వ్యవహరిస్తున్న తీరు చూసేవారికి ఇబ్బందికరంగా ఉంటోందని అదే హౌస్‌లో ఉంటూ, కార్నర్‌ నుండి వాచ్‌ చేసే కౌషల్‌ ఆల్రెడీ ఈ విషయమై తనీష్‌ని హెచ్చరించాడు. అయినా తనీష్‌ తన ఆటిట్యూడ్‌ని మార్చుకోలేదు. అయితే తాజాగా ఫ్రీజింగ్‌ టాస్క్‌లో భాగంగా ఒక్కొక్క ఇంటి సభ్యుని కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపిస్తున్నారు బిగ్‌బాస్‌.

 

దీప్తి హజ్‌బెండ్‌ శ్రీకాంత్‌ కూడా హౌస్‌లోకి వెళ్లారు. ఆయన హౌస్‌ సభ్యులతో కాసేపు ముచ్చటించి, వెళ్లే ముందు తనీష్‌కి స్వీట్‌గా వార్నింగ్‌ ఇచ్చి వెళ్లారు. ఫిజికల్‌ టాస్క్‌లు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్త అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్‌ తనీష్‌కి కొంచెం గట్టిగానే తగిలినట్లయ్యింది. వెంటనే స్మోకింగ్‌ రూమ్‌కి వెళ్లి దమ్ము లాగేస్తూ తెగ ఫీలైపోయాడు. దీప్తి హజ్‌బెండ్‌ మాటలు గట్టిగా గుచ్చుకున్న తనీష్‌ని ఓదార్చడం సామ్రాట్‌కి చాలా కష్టమైపోయింది. చూడాలి మరి, ఇకపై అయినా తనీష్‌లో ఏమైనా మార్పు వస్తుందేమో.

ALSO READ: తాతగారి కారులో తొలిరోజు షూటింగ్‌కి..!