ENGLISH

తెర పై దేవి శ్రీ మ్యాజిక్?

15 May 2024-17:07 PM

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్నాడు. దేవి శ్రీ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా కొన్నిసినిమాలు చేసాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందాడు. పుష్ప పాటలు వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యాయి. దీనితో దేవిశ్రీ కి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నాడు.  ప్రస్తుతం పుష్ప 2  తో మరొక సారి సత్తా చాటనున్నాడు. మొదటి పార్ట్ ని మించేలా పుష్ప 2 ఉంటుందని  చెప్తూనే ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక సౌత్ సినిమా కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తోంది. 


ఆ అంచనాలను రీచ్ అయ్యేలా సుకుమార్ ఈ సినిమాని తీర్చి దిద్దుతున్నారు. మొదటి భాగం లో ఉన్న నటీ నటులతో పాటు కొత్త వారు కొందరు యాడ్ అవుతున్నారు. ఈ సిరీస్ మూడో భాగం కూడా ఉందని బన్నీ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.. పుష్ప 2 లో ఒక సర్ ప్రైజింగ్ క్యారక్టర్ లో దేవి శ్రీ ప్రసాద్ నటిస్తున్నట్లు సమాచారం. సినిమాలో కొద్ది నిమిషాల పాటు దేవి పాత్ర ఉంటుందని. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టాక్. పుష్ప లాంటి ప్రాంచైజ్ లో నటించటానికి  దేవికి కూడా సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.   


దేవిశ్రీ కి కూడా నటన పై ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. కానీ ప్రయత్నం చేయలేదు. ఇన్నాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు. పుష్ప లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో క్యామియో రోల్ లో నటించే ఛాన్స్ లభించింది. నటనలో భేష్ అనిపించుకుంటే నటుడిగా మరిన్ని అవకాశాలు అందుకుంటాడేమో.