ENGLISH

దిల్ రాజుని వాళ్లు దూరం పెట్టారెందుకు?

18 December 2020-10:56 AM

దిల్ రాజు 50వ పుట్టిన రోజు వేడుక ఘ‌నంగా జ‌రిగింది. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. అంద‌రికీ కావాల్సిన‌వాడు. అంద‌రితోనూ మంచి అనుబంధ‌మే ఉంది. అందుకే చిత్ర‌సీమ మొత్తం... దిల్ రాజు పార్టీకి త‌ర‌లి వ‌చ్చింది. కోవిడ్ భ‌యాలు ఉన్నా, దిల్ రాజు పై ప్రేమ‌తో.. స్టార్సంతా క‌దిలి వ‌చ్చారు.

 

చిరు, ప‌వ‌న్‌, మ‌హేష్‌, ప్ర‌భాస్, చ‌ర‌ణ్‌.. ఇలా అంద‌రినీ ఒకే పార్టీలో క‌నిపించ‌డం ఆహ్దాద‌ప‌రిచింది. అయితే.. చిత్ర‌సీమ‌లో కీల‌కంగా క‌నిపించే నంద‌మూరి కుటుంబ హీరోలు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు. బాల‌కృష్ణ‌, క‌ల్యాణ్ రామ్‌, ఎన్టీఆర్‌లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే వాళ్ల‌కూ ఆహ్వానాలు అందాయి. దిల్ రాజు స్వ‌యంగా ఫోన్ చేసి పార్టీకి ఆహ్వానించాడు. కానీ నంద‌మూరి హీరోలు మాత్రం రాలేదు. పార్టీలో ఇంత‌మంది హీరోలున్నా - నంద‌మూరి వాళ్ల ప‌త్తా లేరేంటి? అని ఫిల్మ్ న‌గ‌ర్ వాసులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ హైద‌రాబాద్ లోనే ఉన్నారు. అయినా డుమ్మా కొట్టారు. రీజ‌నేంటో??

ALSO READ: బాల‌య్య దూకుడే దూకుడు