ENGLISH

దిల్‌ 'యువరాజు' వస్తున్నాడు

19 July 2018-15:45 PM

దిల్‌రాజు తనయుడొస్తున్నాడట. తనయుడంటే ఆయన కొడుకు కాదు, ఆయన అన్నయ్య కొడుకు. త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడట. ఈ యువ దిల్‌ రాజు తెరంగేట్రం చేయబోయే సినిమాకి 'పలుకే బంగారమాయెనా' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో టీమ్‌ నిమగ్నమై ఉందనీ స్వయంగా దిల్‌రాజు చెబుతున్నారు. 

ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లోనే రూపొందిస్తారట. ఇది పక్కా అని ఆయనే చెప్పారు. ఈ విషయం అటుంచితే టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌లో దిల్‌రాజు ముందు వరసలో ఉంటారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌నీ, యూత్‌ ఎంటర్‌టైనర్స్‌నీ ఎట్రాక్టివ్‌గా ఎలా రూపొందించాలో దిల్‌రాజుకు తెలిసినంతగా మరో ప్రొడ్యూసర్‌కి తెలియదనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. బెస్ట్‌ ప్రొడ్యూసర్‌గా దిల్‌రాజు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. 

ఇకపోతే దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ఇకపై బాలీవుడ్‌కీ చేరనుందట. ఎప్పటి నుండో బాలీవుడ్‌లో ఓ మంచి సినిమాకి ప్రొడక్షన్‌ బాధ్యతలు చేపట్టాలని దిల్‌రాజు అనుకుంటున్నారట. కుదరడం లేదట. అతి త్వరలోనే అందుకు రంగం సిద్ధం చేస్తానని చెబుతున్నారు. బహుశా అది 2020కల్లా ఓ కొలిక్కి రావచ్చని దిల్‌రాజు అంటున్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన 'లవర్‌' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కాక ఆగష్టులో వరుణ్‌ - వెంకీ మల్టీస్టారర్‌ 'ఎఫ్‌ 2' రిలీజ్‌ కానుంది. అక్టోబర్‌లో రామ్‌ - అనుపమా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'హలో గురూ..' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే మహేష్‌తో దిల్‌రాజు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంద. అదీ సంగతి.

ALSO READ: బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్